తెలుగు బిగ్‌బాస్ -5 ఫేం షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్‌పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని షన్నూ స్పష్టం చేశాడు. దీప్తి తన వల్ల ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు.
తమ దారులు వేరు అయినా ఒకరికొకరం మద్దతు ఇచ్చుకుంటామని షణ్ముఖ్ పేర్కొన్నాడు. తాను మంచి వ్యక్తిగా ఎదిగేందుకు గత ఐదేళ్లుగా దీప్తి అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపాడు. దీప్తి ఎప్పటికీ సంతోషంగా ఉండాలని.. ఆమె జాగ్రత్తగా ఉండాలంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేశాడు. ప్రస్తుతం షన్నూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్‌కు కారణం బిగ్‌బాస్ షోనే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సిరితో షన్నూ రిలేషన్ దీప్తికి నచ్చలేదని టాక్ వినిపిస్తోంది.