
Condition for Aditi Shankar:
శంకర్ కుమార్తె అదితి శంకర్ కథానాయికగా నటించిన తమిళ సినిమా ‘నెసిప్పాయా’ తెలుగులో ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో విడుదలైంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఆకాశ్ మురళీ హీరోగా నటించగా, దర్శకుడు విష్ణువర్ధన్ (పంజా ఫేమ్) తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రేమిస్తావా’ ప్రమోషన్లో అదితి శంకర్ తన సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ, చదువు పూర్తి చేసిన తర్వాతే నటనను ప్రయత్నిస్తానని తండ్రికి చెప్పాను. ఆయన దీని గురించి చాలా ఆలోచించారు. చివరికి అంగీకరించారు కానీ ఒక షరతుతో!” అని ఆమె తెలిపారు.
ఆ షరతేమిటంటే? “చిత్ర పరిశ్రమలో నన్ను నేను నిరూపించుకోలేకపోతే తిరిగి మెడిసిన్‌కి వెళ్తాను” అని అదితి శంకర్ కి స్పష్టం చేయాల్సి వచ్చిందట. “ఇది నాకు పెద్ద బాధ్యత. ప్రేక్షకుల ప్రేమే నా భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది” అని చెప్పుకొచ్చారు.
27 ఏళ్ల అదితి శంకర్ తమిళంలో ‘విరుమన్’ సినిమాతో పరిచయమయ్యారు. ఇప్పుడు తెలుగులో ‘ప్రేమిస్తావా’ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సినిమాకు యూత్‌లో మంచి అప్రిషియేషన్ వస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.