Shankar upcoming movies:
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. ఆయన తీసే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అయ్యేది. 1993లో జెంటిల్ మాన్ అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శంకర్ మొదటి సినిమాతోనే కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
జీన్స్, బాయ్స్ వంటి సినిమాలు కుర్ర కారుని ఊపేసాయి. అపరిచితుడు, శివాజీ ఇలా శంకర్ ఖాతాలో బోలెడు బ్లాక్ బస్టర్లు ఉండేవి. అయితే 2007 లో శివాజీ సినిమా తర్వాత శంకర్ కెరియర్ డౌన్ అవుతూ వచ్చింది. రోబో సినిమా పర్వాలేదు అనిపించినా కూడా ఆ తరువాత 2.0, ఐ, వంటి అత్త సినిమాలు ఘోరంగా డిజాస్టర్లు అయ్యాయి.
అయితే 2007 కి ముందు ఉన్న శంకర్ కి తరువాత ఉన్న శంకర్ కి ఏం మారింది అని అభిమానులలో చర్చ మొదలైంది. అప్పటికి ఇప్పటికీ మారింది శంకర్ జీవితంలో సుజాత లేకపోవడం. 2007 దాకా శంకర్ చేసిన దాదాపు అన్ని సినిమాల కి కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రముఖ కోలీవుడ్ రైటర్ ఎస్ రంగరాజన్ దగ్గరుండి చూసుకునేవారు. ఆయన కలం పేరే సుజాత.
2018 లో కొన్ని ఆరోగ్య కారణాల వల్ల 72 ఏళ్ల వయసులో ఆయన కాలం చేశారు. అప్పటినుంచి శంకర్ కెరియర్ కూడా బాగా దెబ్బతింది. చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతూ వచ్చింది. ఇక భారతీయుడు 2 సినిమాతో అయినా శంకర్ గాడిలోకి వస్తారు అనుకుంటే అవుట్ డేటెడ్ స్క్రిప్ట్ తో శంకర్ అభిమానులను సైతం తీవ్రంగా నిరాశకు గురి చేశారు.
సినిమా కోసం కమల్ హాసన్ పడ్డ కష్టం ఊరికే పోయింది అంటూ అభిమానులు సైతం వాపోతున్నారు. అయితే శంకర్ సినిమాలు ఇప్పుడు ఇలా మారిపోవడానికి కారణం రంగరాజన్ లేకపోవడం అని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే అందులో నిజం ఉన్నట్టే అనిపిస్తుంది. మరి శంకర్ చేతుల్లో ఉన్న తర్వాత సినిమాల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.