Shankar Upcoming Movies:
సినిమా అంటేనే బిజినెస్. సినిమా హిట్ ఫ్లాపు అనేది నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువ ముఖ్యం. స్టార్ హీరో సినిమా అయితే విడుదల కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో సగం బడ్జెట్ కొన్ని కొన్ని సార్లు పూర్తి బడ్జెట్ కూడా వచ్చేస్తుంది. కానీ అంత పెట్టి సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్ లు మాత్రం సినిమా సరిగ్గా ఆడకపోతే తీవ్ర స్థాయిలో నష్టపోతారు.
ఇలా చాలా పెద్ద సినిమాల విషయాల్లో జరుగుతూనే వస్తోంది. అయితే మరోవైపు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో శంకర్ తర్వాతే ఎవరైనా. శంకర్ దర్శకత్వం వహించిన చాలానే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే బ్లాక్ బస్టర్లు అయ్యాయి.
అయితే ఈ మధ్యకాలంలో శంకర్ సినిమాల వల్ల అటు నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా అందరికీ నచ్చకపోవచ్చు. రికార్డులు సృష్టించిన సినిమాలు కూడా కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అయితే శంకర్ మాత్రం ఎందుకు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తారు అని అభిమానులలో కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఆఖరికి రాజమౌళి కూడా ఈగ వంటి చిన్న బడ్జెట్ సినిమాలు తీశారు. కానీ శంకర్ మాత్రం ఈ మధ్యకాలంలో చేసే ప్రతి సినిమాకి మినిమం 100 కోట్ల బడ్జెట్ లేదా చేయను అంటున్నారు.
పోనీ అనుకున్న బడ్జెట్లో సినిమా తీయగలరా అంటే అది కూడా కుదరటం లేదు. చాలా సినిమాల విషయంలో శంకర్ బడ్జెట్ క్రాస్ చేసినవే ఎక్కువ. త్వరలో విడుదల కాబోతున్న భారతీయుడు 2 విషయంలో కూడా అలానే జరిగింది. నిజానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ రోజు రోజుకి బడ్జెట్ భారీగా పెరిగిపోతూ ఉండటంతో ఎస్విసి బ్యానర్ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని టేకప్ చేశారు. అప్పటికి కూడా బడ్జెట్ ఎక్కువ అవుతూ ఉండడంతో చాలాసార్లు షూటింగ్ ఆగిపోయి మళ్ళీ మొదలైన సందర్భాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా హిట్ అవుతుందో లేదో పక్కన పెడితే శంకర్ మాత్రం మళ్లీ భారీ బడ్జెట్ సినిమాలో మీదే మొగ్గు చూపుతున్నారు. భారతీయుడు 2, గేమ్ చేంజర్, భారతీయుడు 3 సినిమాల తర్వాత శంకర్ మరొక మూడు సినిమాలు లైన్ లో పెట్టారట. అందులో ఒకటి పీరియాడిక్ సినిమా, మరొకటి జేమ్స్ బాండ్ తరహాలో సినిమా, మరొకటి స్పై థ్రిల్లర్ తరహాలో ఉంటాయట.
అయితే ఆ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పారు శంకర్. దీంతో శంకర్ ఎందుకు భారీ బడ్జెట్ సినిమాలో మాత్రమే చేస్తున్నారు అని అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి స్టార్ హీరోలతో చేసేసి ప్రీ రిలీజ్ బిజినెస్లతో నిర్మాతలు బాగానే గట్టెకుతున్నారు. కానీ కొంచెం అటు ఇటు అయినా కూడా డిస్టిబ్యూటర్లు మాత్రం తీవ్రస్థాయిలో నష్టాలు అనుభవిస్తున్నారు. మరి శంకర్ తీసే ఈ మూడు సినిమాలు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లోకి ప్రాఫిట్ లు వస్తాయో నష్టాలు వస్తాయో చూడాలి.