Indian 3 Budget:
1996 లో కమల్ హాసన్ హీరోగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా భారతీయుడు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ఉన్న సినిమా అది. మాస్టర్ పీస్ లాంటి ఆ సినిమాని వదిలేయకుండా డైరెక్టర్ శంకర్ దానికి సీక్వెల్ ప్రకటించారు. భారతీయుడు 2 అంటూ ఆ సినిమాకి సీక్వెల్ వచ్చింది. ఒక భాగంలో తీయకుండా రెండవ పార్ట్ ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.
అందులో Indian 2 ఆల్రెడీ రిలీజ్ అయిపోయి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు భారతీయుడు 2కి రెండవ భాగం అంటే భారతీయుడు 3 షూటింగ్ జరుగుతోంది. భారతీయుడు 2 సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కానీ కొన్ని అంచనాలు అందుకోవడం సినిమా పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో భారతీయుడు 3 మీద కూడా ఉన్న ఆసక్తి పోయింది.
ఈ రెండు సినిమాలకి కలిపి భారీ బడ్జెట్ అయింది అంటూ చిత్ర నిర్మాత హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా విడుదల ముందే చిత్ర బడ్జెట్ 250 కోట్లు అని వార్తలు వచ్చాయి. అయితే రెండు భాగాలు కలిపి 250 కోట్లు అయ్యి ఉండొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ 250 కోట్లు భారతీయుడు 2 సినిమాకి అయిపోయిందట. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ సీక్వెల్స్ బడ్జెట్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
“ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఆరేళ్లు పట్టింది. మధ్యలో క్రైమ్ ప్రమాదం కొంతకాలం షూటింగ్ ఆగిపోయింది. బడ్జెట్ కూడా హద్దులు దాటిపోవడం తో లైక్ అధినేత శుభస్కరన్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న నన్ను సంప్రదించారు. శంకర్ నీకు కూడా పిలిచి మాట్లాడిన తర్వాత ముందు అనుకున్న బడ్జెట్ కంటే 230 కోట్లు పెంచి అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఆ బడ్జెట్ కూడా సరిపోక ఇంకొక 170 కోట్లు అదనంగా పెట్టారు. అది కూడా సరిపోలేదు చివరికి బడ్జెట్ 500 కోట్లు అయింది” అని షాకింగ్ నిజాలు బయటపెట్టారు ప్రసాద్.
ముందు శంకర్ తో బడ్జెట్ విషయంలో గొడవలు పడినప్పటికీ సినిమా పూర్తి కావడం కోసం నిర్మాతలు కూడా ఆయనతో రాజీ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఎంత బడ్జెట్ ఖర్చైనా కూడా కలెక్షన్లు మాత్రం 100 కోట్లు కూడా రాలేదు. దీంతో డిస్ప్యూటర్లగా పాటు నిర్మాతలకి కూడా భారీ నష్టాలు వాటిల్లాయి.