HomeTelugu TrendingBharateeyudu 2 promotions: చేతి వేళ్ళు, భారతీయుడు 2 సినిమా రెండూ కట్ చేయలేం..

Bharateeyudu 2 promotions: చేతి వేళ్ళు, భారతీయుడు 2 సినిమా రెండూ కట్ చేయలేం..

Shankar interesting comments in Bharateeyudu 2 promotions
Shankar interesting comments in Bharateeyudu 2 promotions

Bharateeyudu 2 promotions:

భారతీయుడు 2 సినిమా జులై 12న విడుదల కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. అటు తమిళనాడులో మాత్రమే కాక ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హడావిడి బాగానే కనిపిస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా రన్ టైం.. గురించి ప్రశ్న ఎదురవగా, భారతీయుడు 2 సినిమాలో కట్ చేయాలి అంటే కుదరదు అని, ప్రతి సీన్ సినిమాకి ఇంపార్టెంట్ అని అన్నట్టు మాట్లాడారు శంకర్. ఈ సినిమా రన్ టైం మూడు గంటల పైన ఉంది. పైగా సినిమాకి రెండవ భాగం కూడా ఉంది. మరి అయిన్ ఎందుకు అంత రన్ టైమ్ అని ఫ్యాన్స్ అభిప్రాయం.‌ కానీ శంకర్ మాత్రం ఆ విషయం గురించి ఏం చేయలేను అని చేతులెత్తేశారు.

“మనం జుట్టు కత్తిరించవచ్చు. చేతి గోర్లు కట్ చేయచ్చు కానీ చేతి వేళ్ళు కట్ చేయలేం కదా. అలాగే భారతీయుడు 2 లో కట్ చేయడానికి ఏమీ లేదు” అని శంకర్ అన్న మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంపారిజన్ ఎలా ఉన్నా శంకర్ కి సినిమా మీద ఉన్న నమ్మకం చూసి సినిమా బాగుంటుంది అని ఫ్యాన్స్ కి కూడా నమ్మకం వస్తుంది.

సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ కే సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి అంత హైప్ లేకపోయినప్పటికీ తమిళ్ ప్రేక్షకులు మాత్రం ఈ కోసం బాగానే ఎదురుచూస్తున్నారు. అయితే మూడు గంటల రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu