
Game Changer Update:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతి త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అక్టోబర్ 2021లో మొదలైన ఈ సినిమా బోలెడు సాంకేతిక కారణాలతో ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.
ఇక ఎట్టకేలకి ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో రెండవ భాగం కోసం ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో అని అభిమానులు కంగారు పడడం మొదలుపెట్టారు.
అయితే శంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ వార్తలకు సమాధానం ఇచ్చారు. శంకర్ మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమాకి సీక్వెల్ ఉండదని స్పష్టం చేశారు. ఇది ఒక స్టాండ్ అలోన్ సినిమా అని, రెండు భాగాలుగా విడుదల చేసేంత కంటెంట్ కథలో లేదు అని శంకర్ తెలియజేశారు.
మరోవైపు శంకర్ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ గురించి పెట్టిన ప్రెస్ మీట్ లో గేమ్ ఛేంజర్ సీక్వెల్ పై కూడా శంకర్ స్పష్టత ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందేమో అన్ని కంగారు పడ్డ అభిమానులు కొంచెం ఊరట చెందుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.
Game Changer Update:
గేమ్ ఛేంజర్ విడుదలలో జరిగిన ఆలస్యాల కారణంగా రామ్ చరణ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఆచార్యలో చిన్న పాత్రలో కనిపించారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక హీరోగా చెర్రీ చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.