HomeTelugu Trendingశంకర్‌- చరణ్‌ మూవీ షూటింగ్‌ అప్డేట్‌

శంకర్‌- చరణ్‌ మూవీ షూటింగ్‌ అప్డేట్‌

shankar and ram charan movi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మించనున్నారు.

రామ్‌చరణ్‌ కెరీర్‌ లో 15వ చిత్రంగా వస్తుంది. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు జరుగునున్నాయి. చిత్రబృందం పోస్టర్‌ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు చరణ్ – కియారా అద్వానిపై శంకర్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. పూజ కార్యక్రమం నేపథ్యంలో కియారా నేడు హైదరాబాద్‌ చేరుకుంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మెగా కుటుంబం కూడా #RC15 లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కూడా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu