Homeతెలుగు News'సైతాన్‌' ట్రైలర్ అంతా బూతులే... తెలుగులో మీర్జాపూర్ కా బాప్ లాంటి సిరీస్!

‘సైతాన్‌’ ట్రైలర్ అంతా బూతులే… తెలుగులో మీర్జాపూర్ కా బాప్ లాంటి సిరీస్!

OTT Shaitan trailer on Hotstar Filled with curse words

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ తెలుగులోనూ ఉన్నారు. అందులో కంటెంట్ కోసం చూసే ఫ్యాన్స్ కొంత మంది అయితే, తెలుగు డబ్బింగ్ లో దొర్లిన బూతుల కోసం చూసే ఫ్యాన్స్ ఎక్కువ మంది. మీర్జాపూర్, పాతాళ్ లోక్, సేక్రెడ్ గేమ్స్ వగైరా వగైరా బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో బూతులతో పాటు న్యూడ్ సీన్స్ సైతం ఉన్నాయి. రానా నాయుడు లో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో వెంకటేష్ డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు.

హిందీ వెబ్ సిరీస్ అంటే బూతులు న్యూడ్ సీన్స్ కామన్ అన్నట్టు తీసి పారేస్తున్నారు. బి గ్రేడ్ వెబ్ సిరీస్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో అటువంటి సిరీస్ లు లేవని చెప్పాలి. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి గాని తెలుగులో మరీ బోల్డ్ సీన్స్ ఎవరూ తీయలేదు. ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రమే అప్పుడప్పుడు బోల్డ్ తీస్తున్నారు.

సైతాన్ ట్రైలర్ చూస్తే రాంగోపాల్ వర్మ ఎవరు? మీర్జాపూర్, పాతాళ్ లోక్ కా‌ బాప్‌ లాంటి సిరీస్ ఇదని చెబుతారంతా! ఫిమేల్ క్యారెక్టర్స్ నోటి నుంచి యదేచ్చగా బూతులు వచ్చేసాయి. దండుపాళ్యం చూసి జడుసుకున్న జనాలు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ అస్సలు చూడకూడదు. మీర్జాపూర్ ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ చూడొచ్చు.

టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ తగిలిన పాయింట్ ఏదైనా ఉందంటే అది సైతాన్ దర్శకుడు మహి వి రాఘవ్ కావడమే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ క్రియేటర్ అతనే. అంతకు ముందు మహి వి రాఘవ్ తీసిన సినిమాలు చూసిన జనాలు సైతాన్ ట్రైలర్ చూసి షాక్ తిన్నారు. ఇప్పటివరకు క్లీన్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్ ఒక్కసారి బోల్డ్ తీస్తే ఆ మాత్రం షాక్ ఉంటుందిలే.

బూతులు తీసేస్తే సైతాన్ ట్రైలర్ లో ఇంటెన్సిటీ కనబడుతోంది. క్రిమినల్స్ బ్యాక్ డ్రాప్ తీసుకుని కొత్త సిరీస్ మహి వి రాఘవ్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. జూన్ 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu