ShahRukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా షారుక్ ఖాన్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2023 జనవరిలో రిలీజైన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సూనామీ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్స్‌కు షారుక్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.
ఈ మూవీ సీక్వెల్ ‘పఠాన్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్త ఫ్యాన్స్‌కి మంచి జోష్ని ఇస్తుంది. ఇప్పటికే నిర్మాత ఆదిత్య చోప్రా-షారుక్ ఖాన్ మధ్య దీనిపై చర్చలు కూడా ముగిశాయట. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల దెబ్బకి సీక్వెల్‌పై అంచనాలు ఓ రెంజ్లో ఉన్నాయి.
పఠాన్ 2 కన్ఫార్మ్ అంటూ సోషల్ మీడియాలో షారుక్ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. 2023 ఏడాదికి గాను హయెస్ట్ కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఇక హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కి పఠాన్ ఈ మూవీ కొత్త జోష్ని ఇచ్చింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీ రోల్స్ పోషించారు.
ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ సినిమాను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. బేషరం సాంగ్‌లో దీపిక వేసుకున్న కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ పాటను సినిమా నుంచి తొలగించాలంటూ నిరసనలు కూడా చేశాయి. ఈ విమర్శలతో సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది. ఈ ఆరోపణలపై షారుక్ ఖాన్ కూడా అప్పట్లో స్పందించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఆలోచన తమకు లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమాను ఇంతగా ఆదరించిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.