
Shah Rukh Khan Mannat:
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటన, స్టార్‌డమ్ మాత్రమే కాదు, ఆస్తుల విషయంలోనూ టాప్ పొజిషన్‌లో ఉంటారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న షారుక్ ఖాన్, ఇప్పుడు అద్దె ఇంట్లోకి మారనున్నాడనే వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
షారుక్ ఖాన్ కుటుంబం ప్రస్తుతం ముంబైలోని పాలీహిల్ ఏరియాలో రెండు డూప్లెక్స్ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుంది. నెలకు రూ.24.15 లక్షల చొప్పున, ఏడాదికి దాదాపు రూ.2.9 కోట్ల అద్దె చెల్లించబోతున్నాడు. ఫ్యాన్స్ మన్నత్‌ను వదిలి ఎందుకు వెళ్లాడని ఆశ్చర్యపోతుండగా, అసలు విషయం బయటకొచ్చింది.
View this post on Instagram
షారుక్ ఖాన్ విలాసవంతమైన మన్నత్ బంగ్లాకు త్వరలో భారీ నవీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇది గ్రేడ్ 3 హెరిటేజ్ స్టేటస్ కలిగిన భవనం కావడంతో అనుమతులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. నవీకరణ పనులు మే నుంచి ప్రారంభం కానుండటంతో, కుటుంబానికి అసౌకర్యం కలగకుండా తాత్కాలికంగా కొత్త ఇంటికి మారనున్నాడు.
షారుక్ ఖాన్ అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ నిర్మాత వశు భగ్నానీ పిల్లలు జాకీ భగ్నానీ, దీప్షిఖా దేశ్ ముఖ్‌లకు చెందినది. ఈ అపార్ట్మెంట్‌లో 1వ, 2వ, 7వ, 8వ అంతస్తుల్లో షారుక్ కుటుంబం, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది కూడా ఉండబోతున్నారు.
ఈ రీనోవేషన్ పనులకు కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే షారుక్ ఖాన్ రెండు సంవత్సరాల పాటు తన మన్నత్ బంగ్లాను విడిచి అద్దె ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది.
ALSO READ: కోలీవుడ్ సినిమాకోసం Sreeleela పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే