
Shah Rukh Khan Manager Pooja Dadlani Salary:
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ విజయానికి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో పూజా దద్లానీ ఒకరు. 2012 నుండి షారుఖ్ కెరీర్‌ని మెయిన్టెన్ చేస్తున్న పూజా, కేవలం మేనేజర్ మాత్రమే కాకుండా, అతని వ్యాపార వ్యూహాలకు కీలకంగా మారారు.
పూజా దద్లానీ ముంబయికి చెందినవారు. 2012 నుంచి షారుఖ్ ఖాన్ ప్రొఫెషనల్ మరియు పర్సనల్ వృత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, లీగల్ మరియు బిజినెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ జీవితంలో ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి కావడంతో ఆమె ఏటా భారీ మొత్తం సంపాదిస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2022 నుండి 2024 వరకు ఆమె వార్షిక ఆదాయం రూ.7 కోట్లు నుండి రూ.9 కోట్లు మధ్య ఉందని సమాచారం. అయితే 2025 నాటికి ఈ మొత్తం రూ.9 కోట్లకు మించి ఉండే అవకాశం ఉందని, ఆమె దేశంలోనే అత్యధికంగా పారితోషకం అందుకునే సెలబ్రిటీ మేనేజర్‌గా మారినట్లు ఫ్యాన్ క్లబ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
కేవలం మేనేజర్ మాత్రమే కాదు, పూజా షారుఖ్ కుటుంబంతోనూ దగ్గర సంబంధం కలిగి ఉన్నారు. షారుఖ్ సినిమాల ఎంపిక నుండి అతని బిజినెస్ వ్యూహాలు, ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ పూజా పర్యవేక్షిస్తుంటారు. అందుకే ఆమెను షారుఖ్ ప్రొఫెషనల్ కెరీర్ వెనుక ఉన్న అసలు బలం అని అభిమానులు ప్రశంసిస్తుంటారు.
షారుఖ్ ఖాన్ కెరీర్‌ను విజయవంతంగా నిర్వహించడంలో పూజా దద్లానీ పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న మేనేజర్‌గా రికార్డు సృష్టించారు. ఆమె జీతం ఇంకా పెరిగే అవకాశం ఉండగా, భవిష్యత్తులో మరింత విజయాలు సాధించే అవకాశం ఉంది.