
Shah Rukh Khan Pali Hill Home:
షారుఖ్ ఖాన్ గురించి చెప్పాలంటే, సినిమాల సంగతి అటుంచితే ఆయన లైఫ్‌స్టైల్, ఇంటి గురించి కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు ముంబయిలో ఆయన చేసిన కొత్త రియల్ ఎస్టేట్ డీల్ బాగా చర్చనీయాంశమైంది. బాంద్రా, జుహు, పాలి హిల్ లాంటి ప్రైమ్ ఏరియాస్‌లో బాలీవుడ్ స్టార్స్ లగ్జరీ ప్రాపర్టీలు కొంటున్నారు లేదా లీజుకు తీసుకుంటున్నారు. రణబీర్ కపూర్, కృతి సనోన్, శ్రద్ధా కపూర్ వంటి స్టార్స్ ఇప్పటికే ఇలాంటివి చేశారు. ఇప్పుడు షారుఖ్ కూడా ఇదే బాటలో నడిచారు.
షారుఖ్ ఖాన్ ఇటీవల ముంబయి పాలి హిల్‌లోని పూజా కాసా బిల్డింగ్‌లో రెండు డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకున్నారు. మొత్తం మూడు సంవత్సరాల ఈ లీజు విలువ రూ. 8.67 కోట్లు. మొదటి అపార్ట్‌మెంట్ జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లకు చెందినదైతే, రెండోది ప్రముఖ నిర్మాత వాషు భగ్నానికి చెందినది. మొదటి అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ. 11.54 లక్షలు, రెండో అపార్ట్‌మెంట్‌కు రూ. 12.61 లక్షలు అద్దె చెల్లించాలి. మొత్తం మీద షారుఖ్ నెలకు రూ. 24.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
View this post on Instagram
ఇది ఎందుకు అంటే, ఆయన నివాసం మన్నత్‌లో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుండి అనుమతులు రాగా, మన్నత్‌కు అదనంగా రెండు ఫ్లోర్స్ కలపడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందు మన్నత్‌కు సంబంధించిన ఓన్‌ర్షిప్ ఫీజుల్లో పొరపాటు వల్ల షారుఖ్ ఖాన్ రూ. 9 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేసిందని వార్తలు వచ్చాయి.
ఇక ఈ కొత్తగా లీజుకు తీసుకున్న అపార్ట్‌మెంట్లు, మన్నత్ విస్తరణ పనులు పూర్తయ్యేంత వరకు ఆయన కుటుంబ సభ్యులు లేదా సిబ్బందికి తాత్కాలిక వసతిగా ఉపయోగపడతాయి. షారుఖ్ ఖాన్ లైఫ్‌స్టైల్‌ను చూస్తే, ఆయన ఎప్పుడూ తన కంఫర్ట్‌కి పెద్ద పీట వేస్తారు. మన్నత్‌ను మరింత గ్రాండ్‌గా మార్చడానికి తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.