HomeTelugu Trendingబోట్ లో అరెస్ట్ అయిన Shahrukh Khan.. వైరల్ అవుతున్న Pawan Kalyan మీమ్స్!

బోట్ లో అరెస్ట్ అయిన Shahrukh Khan.. వైరల్ అవుతున్న Pawan Kalyan మీమ్స్!

Shah Rukh Arrested on a Boat? Pawan Kalyan’s Dialogue Sparks Memes!
Shah Rukh Arrested on a Boat? Pawan Kalyan’s Dialogue Sparks Memes!

Pawan Kalyan memes with SRK:

సోషల్ మీడియా ప్రపంచం మరోసారి మీమ్స్ తో మునిగిపోయింది. ఈసారి మన ఇద్దరు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో హాస్యాన్ని తెచ్చారు. పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పిన “సీజ్ ది షిప్” డైలాగ్‌కు షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ సీన్లను జత చేస్తూ మీమ్స్ వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పీడీఎస్ రేషన్ రైస్‌ను అక్రమంగా ఆఫ్రికాకు తరలించే ప్రయత్నం జరుగుతుందని గుర్తించారు. స్టెల్లా అనే నౌకపై స్మగ్లింగ్ చేస్తున్నారని నిర్ధారించి, “సీజ్ ది షిప్” అంటూ పవన్ ఆదేశించారు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Lithish y (@bulabbai_memes)

అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఒక నౌకలో షారుఖ్ అరెస్టు అవుతున్న సీన్‌ను ఈ డైలాగ్‌కు జత చేశారు. “సీజ్ ది షిప్” అంటూ పవన్ చెబుతుంటే, షారుఖ్ బోటులో షాక్ అయినట్టుగా ఉన్న సీన్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన, జాతీయ భద్రతా అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని, నేరస్తులను ప్రశ్నిస్తూ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయాయి. “పోర్ట్ స్మగ్లింగ్‌కి కాదు, ఇది జాతీయ భద్రత అంశం” అంటూ పవన్ స్పష్టత ఇచ్చారు.

ఈ డైలాగ్, మీమ్స్ రూపంలో కొత్త హైప్ తెచ్చింది. పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇద్దరూ మీమ్స్ ను విపరీతంగా పంచుకుంటున్నారు. ఇతర భాషల్లో కూడా ఈ మీమ్స్ అనువాదం అవుతున్నాయి. పవన్ పవర్‌ఫుల్ డైలాగ్‌కి, షారుఖ్‌ నటన కలిసిన ఈ వినూత్న కాంబినేషన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది

ALSO READ: Hyderabad Metro లో Mahesh Babu అభిమానుల రచ్చ.. ఏం చేశారంటే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu