
Shabdam Movie Review:
ఆది పినిశెట్టి కెరీర్‌లో మరో హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా శబ్దం. వైశాలి మూవీ తరువాత అదే కాంబినేషన్ అయిన అరివళగన్-తమన్ మళ్లీ జట్టుకట్టడం సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సౌండ్ ఆధారంగా రూపొందిన ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
హోలీ ఏంజెల్ కాలేజీలో వరుసగా స్టూడెంట్ల మరణాలు జరుగుతుంటాయి. వాటికి కారణం దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ మిస్టరీని చేధించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. అవంతిక (లక్ష్మీ మీనన్) అనే స్టూడెంట్ దెయ్యాల ఉనికి లేదని థీసిస్ చేస్తుంటుంది. వ్యోమ తన దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలను కనిపెడతాడు. అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు? ఆ కాలేజీలో జరిగిన నిజం ఏమిటి? అనేదే కథ.
నటీనటులు:
ఆది పినిశెట్టి తన క్యారెక్టర్‌కి పూర్తిగా న్యాయం చేశాడు. ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా సెటిల్డ్‌గా నటించాడు. లక్ష్మీ మీనన్ పాత్రకు మంచి స్కోప్ ఉంది. సిమ్రన్, లైలా తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. రెడిన్ కింగ్స్లీ కామెడీ కొద్దిసేపు నవ్విస్తుంది.
సాంకేతిక అంశాలు:
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరోలెవల్‌కి తీసుకెళ్లింది. కెమెరా వర్క్, విజువల్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా కనిపించాయి.
ప్లస్ పాయింట్స్:
*కొత్త కాన్సెప్ట్
*తమన్ మ్యూజిక్
*అద్భుతమైన విజువల్స్
*ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్:
-రొటీన్ కథనం
-సెకండాఫ్ బోర్
-ఇంతకముందు చూసిన కాన్సెప్ట్‌ల మేళవింపు
-క్లైమాక్స్ నిరాశపరిచేలా ఉంది
తీర్పు:
శబ్దం కొత్త కాన్సెప్ట్ అయినా, ప్రేక్షకుల్ని పూర్తిగా కనెక్ట్ చేయడంలో విఫలమైంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా ఉన్నా, సెకండాఫ్ రొటీన్ కథనంతో నిరాశపరిచింది. థీమ్ కొత్తగా ఉన్నా కథనం లోపించడంతో సినిమా మోస్తరు స్థాయిలోనే నిలిచింది.
రేటింగ్: 2.75/5
ALSO READ: Suzhal 2 Review: మొదటి సీజన్‌ను మించేలా ఉందా లేదా?