టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తునన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇటీవలే విడుదలైన టీజర్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన టెలివిజన్ నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్ అంతా పెళ్లి చూపుల ఫార్మాట్ లోనే జరుగుతుంది. ఫారిన్ నుంచి వచ్చిన ఒక ఎన్నారై టైం వేస్ట్ చేయకుండా ఒక రోజు 3 పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథ. ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది. మార్చి 5న ఈ సినిమా విడుదల కానుంది.