అలనాటి అందాల రాశి బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా తనదైన శైలిలో సత్తా చాటింది. నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. హీరోయిన్‌గా ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత రాశి 25కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మరోవైపు కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసి మార్క్‌లు కొట్టేసింది. తాజాగా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రాశి.. ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఫిల్మ్ కెరీర్‌తో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలనటిగా ఉన్నపుడు సినిమాల ప్రివ్యూలు చూసేందుకు పాస్‌లు వచ్చేవి. ఆ సమయంలో నేను ఎక్కువగా హీరోగా వెంకటేష్ సినిమాలను ఎక్కువగా చూసినట్టు చెప్పుకొచ్చారు. ఆ టైమ్‌లో వెంకటేష్ అంటే క్రష్ ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో పెద్దయ్యాక ఎవరిని పెళ్లాడుతావు అని చాలా మంది నన్ను అడిగితే… హీరో వెంకటేష్ అని తడుముకోకుండా సమాధానం చెప్పేదాన్ని. తాను పద్నాలుగేళ్లకే హీరోయిన్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా రాశి ప్రస్తావించింది.
ఇక వెంకటేష్‌తో శ్రీను సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చారు రాశి. కాని కాస్తా పెరిగి పెద్దయ్యాక దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఇష్టం పెరిగి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిందన్నారు. మరోవైపు నేను బాలనటిగా బాలయ్యబాబు తో ‘బాల గోపాలుడు’ సినిమా చేసాను. ఆ తర్వాత ఆయనతో ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఆయనంటే తెలియని భయం అంటూ చెప్పుకొచ్చింది. మొదటి రోజు షూటింగ్‌కు కారు దిగి సెట్‌కు వెళ్లే సమయంలో బాలయ్య కూర్చొని ఉన్నారు. నేను పలకరించే లోపే ఆయన నన్ను విష్ చేసి.. ఎలా ఉన్నావ్.. ఇలా రా అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. దీంతో నేను కూల్ అయ్యానంటూ అప్పటి అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.