ప్రముఖ నటుడు రచయిత, సంపాదకుడు, నటుడు గొల్లపూడి మారుతి రావు అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. వయసు కారణంగా వచ్చే రుగ్మతలతో అయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. కాగా, చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపోలో హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పత్రికలో పనిచేస్తూనే రచయితగా మారి అనేక కథలు, నాటకాలు రాశారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు.