ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఆదివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యాడు.
పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతో పాటు అందులో నటించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాస్ట్యూమ్ కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ నిర్మాత దిల్ రాజు ట్వీట్ చేశారు. సినీ రంగంలో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు కృష్ణ.
ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలను నిర్మించడంతో పాటు పలు చిత్రాలలో విలన్ గా, సహాయక నటుడిగా పాత్రలు పోషించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి తదితర సినిమాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు