ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సీనియర్ నటి సుధ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఓ మూవీ సెట్‌లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్న సమయంలో సుందరం మాస్టర్ నాతో డ్యాన్స్ మూమెంట్స్ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంలో 5కు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే అరిచారు.
అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు’ అంటూ అనకుడని మాట అన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు భరించలేదకపోయానని, ఆ సమయంలో ప్రభు, పి.వాసు సహా పలువురు పెద్దలు సెట్‌లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకుని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా, పెద్ద ఆర్టిస్టు అయినా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకుడని పదాలు అన్నారంటూ సుధ వాపోయారు.