HomeTelugu Trending‘వదినమ్మ’ నటికి కరోనా.. ఆ నటుడిపై తీవ్ర వ్యాఖ్యలు

‘వదినమ్మ’ నటికి కరోనా.. ఆ నటుడిపై తీవ్ర వ్యాఖ్యలు

Senior actress shiva parvat 1
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. అందులో భాగంగానే న‌టి శివ పార్వతి కూడా కరోనా బారిన పడ్డారు. కోలుకుని నిన్న రాత్రే ఇంటికి చేరుకున్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తాను అనుభవించిన మానసిక సంఘర్షణకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ‘వదినమ్మ’ యూనిట్‌పైనా, ఆ సీరియల్‌ను నిర్మిస్తూ, నటిస్తున్న ప్రభాకర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను కరోనా బారినపడి రెండు ఆసుపత్రులు మారిన విషయం ప్రభాకర్‌కు, యూనిట్‌కు తెలుసు.. కానీ ఎవరూ పట్టించుకోలేదని, కనీసం ఎక్కడ ఉన్నాను? ఎలా ఉన్నానన్న విషయం గురించి కూడా ఎవరూ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదని, పైపెచ్చుథ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

తనకు కనుక ఈ పరిస్థితి రాకుంటే ఎవరెలాంటివారన్న విషయం తెలిసేది కాదని శివపార్వతి తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ తోడుండరని, ప్రభాకర్ నుంచి తానేమీ పెద్దగా ఆశించడం లేదని అన్నారు. మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోయిన తర్వాత కూడా ఇలాగే స్పందిస్తారేమోనని, ఎవరికీ తెలియనివ్వకుండా సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారని అన్నారు. ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచితే చనిపోతారనుకున్న వారికి కూడా బలం వస్తుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. తాను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవితా రాజశేఖర్ ఆసుపత్రికి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశారని శివపార్వతి చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu