అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ జంటగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో బంగార్రాజు పాత్రలో నాగార్జున అదరగొట్టేశాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో నాగచైతన్య, అఖిల్ నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సమంత జోడీగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా ఆ తర్వాత తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు జయప్రద. చాలా గ్యాప్ తర్వాత బంగార్రాజు మూవీతో రీఎంట్రీ ఇస్తే అభిమానులకు పండగే.