దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ప్రధానమైన పాత్రధారిగా తనికెళ్ల భరణి ఒక సినిమా చేయనున్నారనే సంగతి తెలిసిందే. నూరు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇప్పుడు ఆన్స్క్రీన్లోను కనిపించి సందడి చేయనున్నాడట. ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కనిపిస్తారని టాక్. ఈ మధ్య కాలంలో ‘మిథునం’ , ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, ఓ బేబి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఇప్పుడు రాఘవేంద్రరావు సరసన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రియ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయనుందిని అంటున్నారు. లాక్డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. కాగా, రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు హీరోగా పెళ్లి సందడి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.