HomeTelugu Trendingనటి కృష్ణవేణి సంచలన వ్యాఖ్యలు

నటి కృష్ణవేణి సంచలన వ్యాఖ్యలు

Senior actress Krishnaveni

టాలీవుడ్ సీనియర్ నటి కృష్ణవేణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా ఆమె ఎన్నో సినిమాలో నటించారు. తన సినిమాలకు దర్శకత్వం వహించిన రాజాచంద్రను వివాహమాడారు. అయితే ఆ వివాహం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు.

‘నేను రాజాచంద్రను అనుకోని పరిస్థితిల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అస్సలు నాకు నలుపు అంటేనే నచ్చదు. అలాంటిది నల్లగా ఉండే రాజా చంద్రను వివాహమాడను అంటే కొన్ని అనివార్య కారణాలు అప్పుడు అలా చేశాయి. మా పెళ్లి జరిగేటప్పటికే ఆయనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పక్క సినిమాలతో ఆయన బిజీగా మారిపోయారు. చిన్న అద్దె ఇంట్లో ఉండే ఆయన వరుస సినిమాల విజయాలతో లక్షలు తీసుకునే రేంజ్ కి వచ్చారు. అది చాలామందికి నచ్చలేదు. ఇండస్ట్రీలో ఉండే ఒక హీరోయిన్ కన్ను మా ఆయనపై పడింది. ఆమెతో కలిసి ఇండస్ట్రీ వాళ్లే నా భర్తను చంపేశారు. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆయనను ఎవరు చంపారో పోలీసులకు కూడా తెలుసు. కానీ వారు ఏమి చేయలేమని చేతులెత్తేశారు. ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. రెండేళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu