త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో సీనియర్ హీరోయిన్‌తో ఒక కీలకమైన పాత్రను చేయిస్తుంటారు. అలా ఆయన ఇప్పటివరకూ.. నదియా, స్నేహ, ఖుష్బూ, టబు వంటి సీనియర్ హీరోయిన్స్ కి కీలకమైన పాత్రలు ఇస్తూ వచ్చారు. ఈ సారి ఆయన సీనియర్ హీరోయిన్ శోభనను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తరువాత సినిమాని మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో పిన్ని పాత్ర చాలా ముఖ్యమైనదిగా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందట. ఆ పాత్రకోసం శోభనను ఎంపిక చేశారని అంటున్నారు.
తెలుగులో హీరోయిన్ గా శోభన ఒక వెలుగు వెలిగారు. 1993లో వచ్చిన ‘రక్షణ’ సినిమాలో చివరిగా హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత ఆమె రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.