HomeTelugu Trendingసీనియర్‌ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

senior actor krishnam raju
ప్రముఖ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు(82) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు 1940లో 20 జనవరి జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. 1966లో ‘చిలకా గోరింక’ తో ఎంట్రీ ఇచ్చారు. హీరోగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గానూ పలు సినిమా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.

2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. మొత్తంగా 187 సినిమాల్లో నటించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu