HomeTelugu Trending'పుష్ప' సినిమా సమంత వల్లే అంత పెద్ద హిట్‌: భాను చందర్

‘పుష్ప’ సినిమా సమంత వల్లే అంత పెద్ద హిట్‌: భాను చందర్

Samantha Dance Rehearsal For Pushpa Song Video Viral

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ‘పుష్ప ది రైజ్’ సినిమాను నిర్మించారు.పుష్ప ది రైజ్’ గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవల్లో విడుదలై ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసింది … ఈ ఏడాదిలో దీనికి రెండో భాగం ‘పుష్ప ది రూల్‌’ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. తొలి ప్ర‌య‌త్నంలోనే బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌గా బాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేయ‌టం ట్రేడ్ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ విష‌యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ‘పుష్ప ది ర‌రూల్‌’ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ యాక్ట‌ర్ భాను చంద‌ర్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ‘బాలీవుడ్ సినిమాలను మన దక్షిణాది సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. సౌత్ నుంచి పాన్ ఇండియా మూవీస్ అంటూ విడుదలవుతున్న సినిమాలు అక్కడ ఘన విజయాన్ని సాధిస్తున్నాయి. అంతెందుకు రీసెంట్‌గా విడుద‌లైన పుష్ప సినిమా ఎంత సంచ‌ల‌నం సృష్టించింది. ముఖ్యంగా స‌మంత న‌టించిన ఊ అంటావా మావ‌…సాంగ్ వ‌ల్ల‌నే సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. ఆ పాట అన్ని లాంగ్వేజెస్‌లో మారు మోగింది’ అని చెప్పారు.. స‌మంత కాక‌పోతే మ‌రొక‌రు ఉన్నా కూడా పాటకు క్రేజ్ వ‌చ్చేది కానీ.. స‌మంత చేయ‌టం వ‌ల్ల‌నే సినిమా హిట్ అయ్యిందంటూ భాను చందర్ చేసిన వ్యాఖ్య‌లపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu