నటి, పాప్ సింగర్ సెలీనా గోమేజ్ ఓ సంచలన ప్రకటన చేసింది. తన సహనటుడైన బిల్ ముర్రేను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవంలో సెలీనా తొలిసారి రెడ్ కార్పెట్‌పై హోయలొలికించింది. ఆమె నటించిన “ది డెడ్ డోన్ట్ డై” సినిమాను కేన్స్‌లో ప్రదర్శించారు. ఇందులో సెలీనా, బిల్ ముర్రే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన కేన్స్ లుక్‌ను పోస్ట్ చేస్తూ.. కేన్స్‌లో తొలిసారి పాల్గొన్నా. ది డెడ్ డోన్ట్ డై చిత్రంలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మరో విషయం ఏంటంటే.. నేను నా సహనటుడైన బిల్ ముర్రేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించింది.
పెళ్లి గురించి సెలీనా జోక్ చేశారో లేక సీరియస్‌గా అన్నారో తెలీదు కానీ ఈ ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే బిల్ ముర్రే వయసు 68. సెలీనాకు 26. తాత వయసున్న వ్యక్తితో పెళ్లేంటంటూ కామెంట్లు పెడుతున్నారు. తన మాజీ ప్రియుడైన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సెలీనా కోపంలో ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా ఈ విషయం కాస్తా హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.