Keerthy Suresh Wedding Guest List:
ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం ఆమె సోషల్ మీడియాలో తన ప్రేమ కథను పంచుకుంటూ, గత 15 సంవత్సరాలుగా వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని తెలిపారు. ఆమె తమ వివాహం వచ్చే నెల జరుగుతుందని వెల్లడించారు.
ఈ జంట కుటుంబాలు ఇప్పటికే వివాహ వేడుకల కోసం గోవాలోని ఒక ప్రత్యేక రిసార్ట్‌ను బుక్ చేశారు. వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాలలో వైభవంగా జరుగుతుందని సమాచారం. ఈ వేడుకలకు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు.
View this post on Instagram
ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి, నాని వంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరవుతారని తెలుస్తోంది. చిరంజీవి, కీర్తి తల్లి స్నేహితులు కావడంతో ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే, నాని తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి అత్యంత సన్నిహితుడు కావడంతో కచ్చితంగా నాని కూడా వస్తారని చెప్పచ్చు.
తమిళ పరిశ్రమ నుంచి దర్శకుడు అట్లీ, విజయ్‌తో పాటు కొన్ని ప్రముఖ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. వివాహ వేడుకలు రెండు రోజులు సాగుతాయని, ప్రత్యేక విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని సమాచారం.
అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివాహం తర్వాత ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.