దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద రచనా విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న సినిమా ”అలాంటి సిత్రాలు”. కె రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఐ &ఐ ఆర్ట్స్ మరియు కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శ్రీ వరుణ్ – రాహుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా ఫస్ట్ లుక్ – టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
తాజాగా ఆ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. చిన్న సినిమా అయినప్పటికీ ఈ ట్రైలర్ తో కంటెంట్ విషయంలో పెద్ద చిత్రమని అర్థం అవుతోంది. ఈ కథకు మెట్రో ట్రైన్ లో జర్నీకి లింక్ చేస్తూ కథనం ఉన్నట్లు తెలుస్తోంది. బోల్డ్ సన్నివేశాలు – భావోద్వేగాలతో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.