హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ డైరెక్షన్‌లో వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ నుంచి బుధవారం(ఫిబ్రవరి 2) ట్రైలర్ విడుదలైంది. ‘సెహరి అంటే ఏంటి భయ్యా? సెహరి అంటే సెలబ్రేషన్స్’, ‘నీ ముఖానికి పెళ్లవడమే ఎక్కువ’, ‘ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా’ వంటి డైలాగులు బాగున్నాయి.
హీరో పార్ట్‌నర్ కోసం వెతకడం, ఎంగేజ్‌మెంట్ నుంచి పారిపోవడం… వంటి సన్నివేశాలు ఆసక్తికి కలిగిస్తున్నాయి. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అభినవ్ గౌతమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని బాలకృష్ణ అనడం వైరల్ కూడా అయింది.