బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘సీత’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ డేట్ ను కూడా లాక్ చేశారు. సీత రిలీజ్ విషయంలో ఇప్పుడు కొంత అయోమయం నెలకొంది.
సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు సమయం మాత్రమే ఉన్నది. ఇంకా కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నట్టుగా సమాచారం. ఈ పెండింగ్ వర్క్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలంటే నెలకంటే ఎక్కువ సమయం పడుతుంది. పైగా ఎన్నికల సమయం కావడంతో రిస్క్ ఎందుకులే సినిమాను వాయిదా వేసుకుంటే బాగుంటే బాగుందని అనుకుంటున్నారట. ఏప్రిల్ 25 నుంచి మే కు వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.