ఇప్పటివరకు సినిమా టైటిల్స్ వివాదం అవుతుండడం చూశాం.. కానీ మొదటిసారి ఓ షార్ట్ ఫిల్మ్ టైటిల్ వివాదానికి దారి తీసింది. అదే ‘సీత ఐయామ్ నాట్ ఎ వర్జిన్’. నిజానికి హిందూ సంప్రదాయాల ప్రకారం సీత అనే పేరు ఎంతో గొప్పది. అటువంటి పేరుకి ‘ఐ యామ్ నాట్ ఎ వర్జిన్’అని ఉపశీర్షికను యాడ్ చేసి లఘుచిత్రాన్ని తెరకెక్కించారు నటుడు కౌశిక్ బాబు. ఇప్పుడు
ఆ ట్యాగ్ లైన్ పెద్ద దుమారానికి తెర లేపింది. చాలా మంది మహిళలు దీని పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సీత అనే పేరులోనే పవిత్రత ఉంటుంది. అటువంటి పేరుకి నేను వర్జిన్ కాదని ట్యాగ్ లైన్ పెట్టడం ఎంతవరకు సమంజసం.
సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమా చూపించామని దర్శకుడు కౌశిక్ బాబు ఎంత సపోర్ట్
చేసుకున్నా.. సరే టైటిల్ విషయంలో మాత్రం మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ టైటిల్ పై చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే ఏకంగా మీ ఇంట్లో వాళ్ళ పేర్లు టైటిల్ గా పెట్టకుండా సీత పేరు ఎందుకు వాడారని ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ టైటిల్ ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. టైటిల్ గనుక మార్చకపోతే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడానికి వీల్లేదని నినాదాలు చేస్తున్నారు. ఇకనైనా.. ఈ టైటిల్ ను మారుస్తారో.. లేక ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. మార్చమని మొండిగా ప్రవర్తిస్తారో.. చూడాలి!