దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజా సినిమా పెదకాపు ఈ నెల 29న విడుదల కాబోతుంది. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలను కూడా టచ్ చేస్తూ ‘పెదకాపు’ సినిమా రూపొందించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో శ్రీకాంత్ అడ్డాల బిజీగా ఉన్నాడు.
‘పెదకాపు’ అనేది కులానికి సంబంధించిన కథ కాదు. ఒక సాధారణ యువకుడు తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాడు, అనుకున్నది ఎలా సాధించాడు, దానికోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మొదటి భాగంలో ఉంటుందని, తాను అనుకున్న స్థాయికి చేరుకున్న తరువాత అతను ఏం చేస్తాడు? అనేది సెకండ్ పార్టులో ఉంటుందని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
శ్రీకాంత్ అడ్డాల సినిమా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీక్వెల్ కూడా చేసే ఆలోచన ఉన్నట్టు తెలిపాడు. ఆ సినిమా సీక్వెల్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు అన్నట్టు తెలిపాడు.మళ్లీ ఆ కాంబినేషన్ కుదిరి ఆ క్రేజ్ రావాలంటే దానికి తగ్గ కథను సిద్ధం చేయాలని, అన్నీ కుదిరితే సీక్వెల్ చేద్దామని చెప్పినట్లు శ్రీకాంత్ అడ్డాల వెల్లడించారు.