టైగర్, రన్ రాజా రన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన బ్యూటీ సీరత్ కపూర్. ఆ తరువాత ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ సీరత్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే తాజాగా నాగార్జునతో కలిసి నటించే అవకాశం కొట్టేసినట్లు టాక్. నాగార్జున, ఓంకార్ కాంబినేషన్ లో రాజు గారి గది సినిమాకు సీక్వెల్ గా ‘రాజుగారి గది 2’ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో ఒక హీరోయిన్ గా సీరత్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున మనుషులతో ఆడుకునే ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర పట్ల నాగార్జున ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పివిపి బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.