Sector 36 Review:
2006 లో జరిగిన నోయిడా సీరియల్ హత్యలపై ఆధారపడిన చిత్రం సెక్టార్ 36. అద్భుతమైన కథనంతో.. మానసిక రోగుల ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ఈ చిత్రం. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ప్రేమ్ సింగ్ గా విక్రాంత్ మాస్సే నటించారు. అతను పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది, ఒక పీడాఫైల్, హంతకుడు, ఇతని క్రూరత్వం వెనుక ఎలాంటి చిన్ననాటి గాయాలు దాగి ఉన్నాయి అనే విషయాలు సినిమా చూస్తే తెలుస్తాయి.
ప్రేమ్ ఒక పెద్దమనిషి బస్సీ (ఆకాశ్ ఖురానా) కింద పని చేస్తూ, అతనిని సంతోషపెట్టడానికి పిల్లలను కిడ్నాప్ చేయడం, అవయవాల దందా వంటి పాపాలు చేస్తుంటాడు. ఈ కథ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ హత్యలు అప్పట్లో దేశాన్ని కుదిపేశాయి. సెక్టార్ 36లో ఉన్న పిల్లలను కాపాడేందుకు ఒక పోలీస్ అధికారి (దీపక్ దోబ్రియాల్) చొరవ తీసుకొని ఈ కేసులోకి ఎంటరవ్వడమే కథలో కీలక మలుపు. కథ వేగంగా సాగుతూ ప్రేక్షకులను ఆద్యంతం కట్టి పడేస్తుంది.
ఈ చిత్రంలో నటుల పర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. దీపక్ దోబ్రియాల్ తన పాత్రను అద్భుతంగా పోషించారు. ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాండేగా ఆయన నటనతో ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో బాగా అలరించారు. ఇక ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే ప్రేమ్ పాత్రలో తన నెగటివ్ షేడ్స్‌తో కూడా కొత్త కోణం చూపించారు.
Read More: Bench Life అంటూ నిహారిక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటిటిలో
సినిమా స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చ. సినిమా చాలా స్లో గా ఉంటుంది కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెక్టార్ 36 ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. మన ఆలోచనలను పరిగెత్తించే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా చూడండి.