నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏంజెల్’. ‘బాహుబలి’ ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రానున్న ‘ఏంజెల్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అక్టోబర్ 15 నుంచి పాలకొల్లు పరిసరాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు 20 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో నాగ అన్వేష్, హేబా పటేల్, సప్తగిరి, షియాజీ షిండే, ప్రదీప్ రావత్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరోవైపు భీమ్స్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ కూడా జెట్ స్పీడులో జరుగుతోంది. ఈ నెలాఖరు నుంచి ముంబైలో వాయిస్ మిక్సింగ్ చేయనున్నాడు భీమ్స్. ఇక ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ రషెస్ చూసిన చిత్రబృందం, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు. అలానే తన కెరీర్ లోనే ‘ఏంజెల్’ గొప్ప సినిమా అవుతోందని హెబ్బా కాన్ఫీడెంట్ గా చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సప్తగిరి ఈ సినిమా రిలీజ్ తరువాత తను నెక్ట్స్ లెవల్ కి వెళ్తానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో నాగ అన్వేష్ ప్రదర్శీస్తోన్న నటన చూసి పలువురు సీనియర్ నటులు మెచ్చుకోవడం విశేషం.