బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అందర్నీ కలిచివేసింది. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలుగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్స్‌కు చెందిన సుకాంతో రాయ్ అనే శిల్పి సుశాంత్ మీద ఉన్న అభిమానాన్ని వినూత్న రీతీలో చాటుకున్నారు. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మ్యూజియంలో సుశాంత్ జ్ఞాపకార్థం ఏకంగా మైనపు విగ్రహాన్నే రూపొందించి వినూత్న రీతిలో నివాళులర్పించారు. ఈ విషయంపై సుకాంతో రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను సుశాంత్‌ను చాలా ఇష్టపడ్డాను. అతను అర్ధాంతరంగా మృతిచెందడం నన్ను మానసిక వేదనకు గురిచేసింది. అతనికి గుర్తుగా నా మ్యూజియం కోసం నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను.
West Bengal: Sukanto Roy, a sculptor from Asansol has created a wax statue of late actor Sushant Singh Rajput. He says, “I liked him a lot, it is sad that he passed away. I have made this statue for my museum. However, if his family requests for his statue I’ll make a new one.” pic.twitter.com/H9DxEDwcbN
— ANI (@ANI) September 17, 2020