HomeTelugu Reviews'సవ్యసాచి' మూవీ రివ్యూ

‘సవ్యసాచి’ మూవీ రివ్యూ

అక్కినేని నటవారసుడిగా వెండితెర పై అరంగేట్రం చేసిన నాగచైతన్య కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవర్‌ బాయ్‌గా సూపర్‌ హిట్లు సాధించిన ఈ స్టార్‌ వారసుడు యాక్షన్‌ హీరోగా మాత్రం ప్రతిసారి ఫెయిల్‌ అయ్యాడు. అయినా మరోసారి అదే కథతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చైతన్య. తనకు ప్రేమమ్‌ లాంటి బిగ్‌ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేశాడు ఈ యంగ్‌ హీరో. మరి ఈ సినిమా అయినా చైతూకు యాక్షన్‌ హీరోగా సక్సెస్‌ ఇస్తుందా..?

1 1

కథ: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ బస్సు ప్రయాణంతో సినిమా ప్రారంభమవుతుంది. ఏ మాత్రం పరిచయం లేని 21 మంది ఆ బస్సులో ప్రయాణిస్తుంటారు. కానీ ఆ బస్సులో ఉన్న అందరికి కామన్‌ పాయింట్‌ వారందరికీ అరుణ్ అనే వ్యక్తి తెలుసు. అనుకోకుండా ఆ బస్సు ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదంలో ఒక్క విక్రమ్‌ ఆదిత్య( నాగచైతన్య) తప్ప బస్సులో ఉన్న అందరూ చనిపోతారు.

విక్రమ్‌ ఆదిత్య.. వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనకు ఆనందం వచ్చినా కోపం వచ్చినా తన ఎడమ చేయి తన కంట్రోల్‌ లో ఉండదు. యాడ్‌ ఫిలిం మేకర్‌ అయిన విక్రమ్‌కు అక్క (భూమిక) కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. తన అమ్మే మళ్లీ మహాలక్ష్మీగా పుట్టిందని నమ్ముతుంటాడు విక్రమ్‌. ఓ యాడ్‌ ఫిలిం పని మీద విక్రమ్‌ న్యూయార్క్‌ వెళ్లి వచ్చే సరికి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి బావ, మహాలక్ష్మి చనిపోతారు. అక్క హాస్పిటల్‌లో ఉంటుంది.

1a

అన్ని సవ్యంగా ఉన్న సమయంలో విక్రమ్‌ ఆదిత్య జీవితంలో తుఫాన్‌ మొదలవుతుంది. ప్రమాదంలో అక్క కూతురు మహాలక్ష్మి కూడా చనిపోలేదని, తన దగ్గరే ఉందని ఓ అజ్ఞాత వ్యక్తి(మాధవన్‌) విక్రమ్‌కి ఫోన్‌ చేసి చెప్తాడు. అసలు పాపను అతను ఎందుకు కిడ్నాప్ చేశాడు..? విక్రమ్‌కి అజ్ఞాత వ్యక్తికి మధ్య గొడవ ఏంటి..? బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి విక్రమ్ ఆదిత్య ఎలా బయటపడ్డాడు..? అన్నదే కథలోని అంశం.

నటీనటులు : సినిమా ప్రధానంగా నాగచైతన్య, మాధవన్‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో అద‍్భుతంగా ఒదిగిపోయారు. ప్రతీ సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న చైతూ ఈ సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎడమ చేయి తన మాట వినని పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడే ఇబ్బందులను చాలా బాగా చూపించాడు. కామెడీ, రొమాన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డ్యాన్స్‌ కూడా చాలా బాగా చేశాడు నాగా చైతన్య.

తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన మాధవన్‌కు ఇది మంచి లాంచ్‌ అనే చెప్పాలి. తాను ఎలాంటి పాత్రనైనా పండించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మాధవన్‌. సైకో విలన్‌గా మాధవన్‌ నటన, మాధవన్‌ పలికించిన హావ భావాలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అయితే మాధవన్‌ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండన్న భావన కలుగుతుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన నిధి అగర్వాల్ కేవలం లవ్‌ స్టోరి, పాటలకే పరిమితమైంది. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, సత్య తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.

విశ్లేషణ : వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అనే డిఫరెంట్ పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి యాక్షన్‌ ఎమోషనల్‌ అంశాలతో మంచి కథను రెడీ చేసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీద ఆవిష్కరించటంలో కాస్త తడబడినట్టుగా కనిపిస్తుంది. సినిమాను ఇంట్రస్టింగ్‌ పాయింట్‌తో మొదలు పెట్టినా.. తరువాత ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలతో నడిపించాడు. హీరోకు ఉన్న ఎడమ చేతి ప్రాంబ్లమ్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్రీ ఇంట్రర్వెల్‌ వరకు అసలు కథ మొదలు కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇంటర్వెల్‌ తరువాత కథ వేగం అందుకుంటుందనుకున్న సమయంలో మరోసారి కాలేజ్‌ ఫ్లాప్‌ బ్యాక్‌ బ్రేక్‌ వేస్తుంది. ఈ సీన్‌లో సుభద్రా పరిణయం నాటకం, నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు పాటు ఆకట్టుకున్నా కథనం ఎమోషనల్‌గా సాగుతున్న సమయంలో ఈ సీన్స్‌ ఇబ్బంది పెడతాయి. మాధవన్‌ లాంటి నటుడు ఉన్నా పూర్తిగా ఉపయోగించుకోలేదనే భావన కలిగిస్తుంది. విలన్‌ క్యారెక్టర్‌ను మరింతగా ఎలివేట్ చేస్తే బాగుండేది. హీరో, విలన్‌ల మధ్య జరిగే మైండ్‌ గేమ్‌ ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి సినిమా స్పీడందుకుంటుంది. నాగచైతన్య యాక్షన్‌ సీన్స్‌, మాధవన్‌ పెర్ఫార్మెన్స్‌ సూపర్బ్‌. కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌కు మరింత హైప్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

1b

హైలైట్స్
కథ
సంగీతం
నాగచైతన్య యాక్షన్‌ సీన్స్‌

డ్రా బ్యాక్స్
లవ్‌ ట్రాక్‌

చివరిగా : యాక్షన్‌, ఎమోషనల్‌తో ‘సవ్యసాచి’
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : సవ్యసాచి
నటీనటులు : నాగ చైతన్య, నిధి అగర్వాల్‌, మాధవన్‌, భూమిక, వెన్నెల కిశోర్‌
సంగీతం : ఎమ్‌.ఎమ్‌.కీరవాణి
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : నవీన్‌ యర్నేని, వై.రవి శంకర్‌, సీ.వీ.మోహన్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

అక్కినేని నటవారసుడిగా వెండితెర పై అరంగేట్రం చేసిన నాగచైతన్య కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవర్‌ బాయ్‌గా సూపర్‌ హిట్లు సాధించిన ఈ స్టార్‌ వారసుడు యాక్షన్‌ హీరోగా మాత్రం ప్రతిసారి ఫెయిల్‌ అయ్యాడు. అయినా మరోసారి అదే కథతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చైతన్య. తనకు ప్రేమమ్‌ లాంటి బిగ్‌ హిట్ అందించిన...'సవ్యసాచి' మూవీ రివ్యూ