అక్కినేని కాంపౌండ్ నవతరం దర్శకుల్లో ప్రతిభావంతుల్ని ఒడిసిపట్టడంలో మేటి. అలా ఇప్పటికే కింగ్ నాగార్జున వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ బంపర్ హిట్లు కొడుతున్నారు. కింగ్ పాటించే ఈ సాంప్రదాయాన్ని నాగచైతన్య ఫాలో అయిపోతున్నాడు. చైతూ తనతో పని చేసిన దర్శకులకు వరుసగా అవకాశాలిస్తున్నాడు. ఆ కోవలోనే అతడు ‘ప్రేమమ్’ ఫేం చందు మొండేటికి మరో ఛాన్సిచ్చాడు. ‘యుద్ధం శరణం’ తర్వాత చందూ దర్శకత్వంలో నటించేందుకు చైతూ ప్రిపరేషన్‌లో ఉన్నాడు. ఇప్పటికే ‘సవ్యసాచి’ అనే టైటిల్‌ని ప్రకటించి, లుక్ లాంచ్ చేశారు. పోస్టర్ అభిమానులతో పాటు కామన్ ఆడియెన్‌లో దూసుకుపోయింది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ అప్‌డేట్ వచ్చింది. ఈనెల 20 నుంచి సవ్యసాచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 20 అంటే ఏఎన్నార్ జయంతి రోజు. ఆ రోజున సెంటిమెంటుగా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నాడు చై. తాతగారి దివ్యాశీస్సులు తనకి పుష్కలంగా ఉండాలని, పెద్ద సక్సెస్ దక్కాలని ఈ యంగ్ హీరో అభిలషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.