HomeTelugu ReviewsSatyabhama review and rating: యాక్షన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ

Satyabhama review and rating: యాక్షన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ

Satyabhama Satyabhama review and rating

Satyabhama review and rating: కాజల్ నటించిన సత్యభామ సినిమా ఈరోజు జూన్ 7న విడుదల అయ్యింది. మరి చందమామగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కాజల్.. సత్యభామగా మేప్పిచ్చిందో లేదో చూద్దాం..

కథ: సత్యభామ(కాజల్ అగర్వాల్) షీ టీమ్స్ లో ACP ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అమ్మాయిలను ఏడిపించే వాళ్ళను, అమ్మాయిలకు సమస్యలు సృష్టించే వాళ్లను.. అసలు వదిలిపెట్టదు ఈ పోలీస్ ఆఫీసర్. కాదా సత్యభామ దగ్గరకు ఓ రోజు హసీనా(నేహా పఠాన్) అనే అమ్మాయి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ఎదు(అనిరుధ్ పవిత్రన్) తో బ్రేకప్ అయినా రోజూ.. ఇబ్బంది పెడుతున్నాడని, ఫిజికల్ గా తనని చాలా టార్చర్ చేస్తున్నట్టు కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన ఎదు హసీనా ఇంటికి వచ్చి ఆమె మీద దాడి చేస్తాడు.

అయితే హసీనా సత్యభామకు కాల్ చేసినా.. ఆమె వచ్చేసరికి సత్యభామ కళ్ళ ముందే హసీనాను చంపేస్తాడు. ఈ నేపథ్యంలో సత్యభామ ఎదుని కాల్చబోయి తన గన్ లో బులెట్స్ వేస్ట్ చేస్తుంది. దీంతో పై ఆఫీసర్స్ సత్యభామను గన్ సరెండ్ చేయమని చెప్పి.. సత్యాను షీ టీమ్స్ నుంచి వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు.

అయితే తన కళ్ళ ముందే హసీనా చనిపోవడం, చనిపోతూ తన తమ్ముడు ఇక్బాల్(ప్రజ్వల్) ని చూసుకోమని చెప్పడంతో.. ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటుంది సత్యభామ. అలానే ఆహంతో పొడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు డాక్టర్ చదువుతున్న హసీనా తమ్ముడు ఇక్బాల్ మిస్ అవ్వడంతో సత్యభామ.. ఆ కేసు టేకప్ చేస్తుంది. దీంట్లో ఓ ఎంపీ తనయుడు రిషి(అంకిత్)కి ఈ విషయంతో సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు అమ్మాయి హత్య వెనుక కారణం ఏమిటి.. ఇక్బాల్ ఏమయ్యాడు? రిషికి, ఇక్బాల్ కి లింక్ ఏంటి? హసీనాను చంపిన ఎదు దొరికాడా? సత్యభామ ఈ కేసుల్ని ఎలా డీల్ చేసింది? సత్యభామ భర్త అమర్(నవీన్ చంద్ర) ఏం చేస్తాడు? అనే విషయాలు తెరపైన చూడాల్సిందే.

నటీనటుల పర్ఫామెన్స్ & టెక్నికల్ సిబ్బంది పనితీరు: ఈ సినిమాకి ఏదైనా పెద్ద హైలైట్ ఉంది అంటే.. అది కాజల్ మాత్రమే. ఇప్పటివరకు చందమామలా కనిపించిన కాజల్ .. ఈ సినిమాలో సత్యభామ లాగా కనిపించడానికి చాలా కృషి చేసినట్టు అర్థమైపోతుంది. ఇక తన నటన, యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టింది ఈ హీరోయిన్. నవీన్ చంద్ర కాజల్ భర్తగా కూల్ గా ఉండే వ్యక్తిగా అలరించాడు. యూట్యూబర్ నేహా పఠాన్ హసీనా పాత్రలో ఎమోషనల్ గా మెప్పిస్తుంది. ప్రజ్వల్, అంకిత్, అనిరుధ్, సంపద.. తమ పాత్రల్లో బాగానే నటించారు. హర్షవర్ధన్, రవివర్మ, ప్రకాష్ రాజ్.. పోలీసాఫీసర్స్ గా అక్కడక్కడా కనపడ్డారు. వీరి పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఇక టెక్నికల్ సిబ్బంది పనితీరుకి వస్తే..సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగా కుదిరాయి. ఇక శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు లేకుంటే సినిమా కొంచెం బాగుండేదేమో. ఇక ఈ చిత్రానికి బిగ్గెస్ట్ మైనస్ కథ. మనం ఎన్నోసార్లు చూసిన కథనే మళ్లీ తీయాలి అనుకున్నారు దర్శకుడు. దానికి తోడు సినిమా ఎడిటింగ్ లో కూడా చాలా సమస్యలు వచ్చే పడ్డాయి.

విశ్లేషణ: ఒక క్రైమ్.. ఇక ఆ క్రైమ్ లో ప్రధాన నిందితుడిని పట్టుకునే వేటలో పోలీస్. ఈ కథను మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసాం. ఇలాంటి థ్రిల్లర్ తీయాలి అంటే.. సస్పెన్స్ అంశాలను బాగా రాసుకోవాలి. అలానే అంతే ఇంట్రెస్టింగ్ గా సినిమాని తీయాలి. కానీ అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఈ చిత్ర దర్శకులు.

అలాగే కథలో చాలా సార్లు వెనక్కి వెళ్తుంటారు. అది ప్రేక్షకులకు కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది. కాజల్ తో యాక్షన్ సీక్వెన్స్ తీయాలి అని కొన్ని ఫైట్స్ పెట్టినట్టు.. మనకు చాలా దగ్గర అనిపించక మానదు.

ఇంట్రవెల్ ముందు మినహా.. ఇక ఎక్కడ అంత సస్పెన్స్ కూడా లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా సాదాసీదాగా సాగిపోయింది.

తీర్పు: చందమామగా హిట్.. సత్యభామగా ఫట్

Rating: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu