HomeTelugu Trendingసత్యరాజ్‌ తల్లి మృతి

సత్యరాజ్‌ తల్లి మృతి

Sathyarajs mother passes aw

తమిళ నటుడు, (బహుబలి) కట్టప్ప సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదాంబళ్ కళింగరాయర్ మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 94. వృద్ధాప్యం కారణంగా కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.

కాగా, సత్యరాజ్‌ నిన్న హైదరాబాద్‌లో ఓ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన కోయంబత్తూర్‌ బయలుదేరి వెళ్లారు. నాదాంబళ్‌కు కుమారుడు సత్యరాజ్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు కల్పన, రూప ఉన్నారు. సత్యరాజ్ తల్లి మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu