తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి, నటుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పలు పార్టీలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. మరోవైపు ఉదయనిధికి సీనియర్ నటుడు సత్యరాజ్ మద్దతు పలికారు.
ఉదయనిధి వ్యాఖ్యల్లో స్పష్టత ఉందని ఆయన అన్నారు. ఆయన ఆలోచనల్లో ఎంతో స్పష్టత ఉందని, ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించే తీరును చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందని అన్నారు. తమిళనాడు సచివాలయంలో సీఎం స్టాలిన్ ను సత్యరాజ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.