HomeTelugu Trendingకోలుకున్న సత్యరాజ్‌.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

కోలుకున్న సత్యరాజ్‌.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Sathyaraj health updat
తమిళ ప్రముఖ నటుడు సత్యరాజ్‌ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కట్టప్ప కోలుకున్నాడు అంటూ ఆయన కుమారుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

సత్యరాజ్ కుమారుడు సిబి సత్యరాజ్ ఈ రోజు ఉదయం ట్విట్టర్‌లో తన తండ్రి క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇంట్లో కొన్ని రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత సత్యరాజ్ తన పనిని తిరిగి ప్రారంభిస్తాడని కూడా ఆయన నిర్ధారించాడు. అలాగే సత్యరాజ్ కొడుకు తన తండ్రి పట్ల చూపుతున్న ప్రేమ, సపోర్ట్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu