కామెడీ హీరోగా తెరపై నాన్‌స్టాప్ గా ‘అల్లరి’ చేసిన నరేష్.. చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ తరువాత ఆయన జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథల కోసం వెయిట్ చేస్తూ సినిమాల సంఖ్యను తగ్గించాడు. ప్రస్తుతం ఆయన ‘బంగారు బుల్లోడు’ సినిమాను చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.
దాంతో ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ రోజున ఉదయం 9 గంటల 44 నిమిషాలకి హైదరాబాద్ – రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కెరియర్ పరంగా ‘అల్లరి నరేష్ కి ఇది 57వ సినిమా. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.