‘పలాస 1978’ హీరో రక్షిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటిస్తుంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ఓ వీడియో ద్వారా అందించాడు హీరో రక్షిత్ అట్లూరి. 3 రోజుల ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఏపీలోని కోనసీమ, అమలాపురం లాంటి అందమైన ప్రదేశాల్లో 50 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తోపాటు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిన కోనసీమకు మేకర్స్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ చిత్రంలో ప్రవీణ్ యెండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ యాక్టర్ దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిలిం కంపెనీతో కలిసి అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.
Thank you Konaseema❤️
It was lovely shooting there..#Sasivadane @komaleeprasad @ahiteja @agfilmcompany @Gauri_Naidu #SaikumarDara #UbbanaSaiMohan #Saravana pic.twitter.com/S1dPLxsA2q
— Rakshit Atluri (@RakshitAtluri) October 18, 2022