HomeTelugu Trendingమహేష్ బాబు 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ ఫిక్స్

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ ఫిక్స్

Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ నేడు పూర్తయింది. పరుశురాం దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. అయితే నేడు ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వడంతో ఓ కొత్త పోస్టర్‌ను వదిలారు. సినిమా షూటింగ్ పూర్తియింది.. ఇక మే 12 నుంచి బాక్సాఫీస్ రివకరీ షురూ అవుతుందని ప్రకటించారు. ఇక మహేష్ బాబు చేతిలో ఉన్న తాళాల గుత్తి, పట్టుకోవడం చూస్తే ఇది క్లైమాక్స్ ఫైట్‌లానే అనిపిస్తోంది.

ఇటీవల మహేష్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట నిర్మాతలపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. సినిమాకు సరైన ప్రొమోషన్స్ నిర్వహించడం లేదని నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో సర్కారు వారి పాట నిర్మాతలు జోరు పెంచారు. త్వరలో థర్డ్ సింగిల్ విడుదల చేసి, వెంటనే టీజర్, ట్రైలర్ విడుదల చేయనున్నారు. మొత్తంగా మొత్తానికి సమ్మర్ స్పెషలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సర్కారు వారి పాట ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. మరో వైపు కీర్తి సురేష్ ఐరెన్ లెగ్ ట్యాగ్‌తో మహేష్ బాబు ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!