తమిళనాడు ప్రభుత్వానికి.. సర్కార్ సినిమాకు మధ్య రెండు రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. సినిమాను సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిందని, సెన్సార్ బోర్డు చెప్పని అభ్యంతరాలు… ప్రభుత్వం ఎలా చెప్తుందని సర్కార్ మేకర్స్ వాదనకు దిగిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ మురుగదాస్ ను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు ప్రయత్నించారని వార్తలు కూడా వచ్చాయి. మద్రాస్ హైకోర్టులో మురుగదాస్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన కొద్దిసేపటికే మరో అప్డేట్ బయటకు వచ్చింది. ప్రభుత్వానికి, సర్కార్ సినిమాకు మధ్య చర్చలు జరిగాయని, సినిమాను రీ సెన్సార్ చేస్తున్నారని వార్తలు రావడంతో ఈ వివాదానికి తెరపడింది. రి సెన్సార్ చేసి ఈ మధ్యాహ్నం నుంచి షోలు వేస్తారని తాజా సమాచారం.