HomeTelugu Trending'సరిపోదా శనివారం' షూటింగ్‌ ప్రారంభం

‘సరిపోదా శనివారం’ షూటింగ్‌ ప్రారంభం

saripodhaa sanivaaram movie

న్యాచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే హామ్‌ నాన్న సినిమాతో ఆకట్టుకున్న నాని నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. నాని 31గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించాడు నాని. తాజా టాక్ ప్రకారం సరిపోదా శనివారం షూటింగ్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ లొకేషన్‌ లో తీసిన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్‌. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.

గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ అంచనాలు భారీగానే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!