HomeOTTSaripodhaa Sanivaaram ఓటీటీ విడుదల ఎక్కడో తెలుసా?

Saripodhaa Sanivaaram ఓటీటీ విడుదల ఎక్కడో తెలుసా?

Saripodhaa Sanivaaram review and rating: Saripoyindi
Saripodhaa Sanivaaram locks its digital streaming partner

Saripodhaa Sanivaaram OTT:

నాని హీరోగా ఇవాళ అనగా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా Saripodhaa Sanivaaram. ప్రియాంక ఆరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటోంది.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫార్మ్ గురించిన వార్త మళ్లీ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అయితే శ్రమ విడుదలక చాలా కాలం ముందే సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. నాని ముందు సినిమాలు హాయ్ నాన్న, దసరా రెండు థియేటర్లలో మాత్రమే కాక ఓటిటిలలో కూడా.. అనుహస్పందన అందుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ వారు సరిపోదా శనివారం డిజిటల్ రైట్స్ ను 45 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇప్పటిదాకా నాని సినిమా వసూలు చేసిన అత్యధిక డిజిటల్ రైట్స్ ఈ సినిమా నుంచి వచ్చాయి. అలా విడుదల కి ముందు నుంచే ఈ సినిమా రికార్డు సృష్టించింది.

అయితే సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మౌత్ టాక్ కూడా చాలా బాగుండడంతో.. సినిమా ఇప్పట్ ఇప్పుడే థియేటర్ల నుంచి ఈ వెళ్లే ప్రసక్తి కనిపించడం లేదు. పైగా పెద్ద కాంపిటేషన్ కూడా లేకపోవడం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అవుతుంది.

కాబట్టి ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తిచేసుకుని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవడానికి.. సెప్టెంబర్ ఆఖరివారం లేదా అక్టోబర్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. గతంలో వివేక్ ఆత్రేయ నాని కాంబోలో వచ్చిన అంటే సుందరానికి కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా మాత్రం కాసుల వర్షం కురిపించేలాగానే కనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu